వీరమల్లు బాక్సాఫీస్ రిపోర్ట్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతకంటే ముందు రోజే జూలై 23న భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేశారు.;

By :  S D R
Update: 2025-07-25 10:22 GMT

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతకంటే ముందు రోజే జూలై 23న భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేశారు. ఇక ఐదేళ్ల నిరీక్షణకు తెర తీసిన ఈ సినిమా తొలి రోజే బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్ ఓపెనింగ్ సాధించింది.

ప్రీమియర్స్ తో కలుపుకుని ‘హరిహర వీరమల్లు‘ తొలి రోజు రూ.70 కోట్లు గ్రాస్ వసూలు చేసిందనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ కలెక్షన్లతో పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ రాబట్టిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటిగా నిలిచింది.

ఇక తొలి రోజున థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో నడిచింది. అయితే ఆ తర్వాత సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కొంతమేరకు డ్రాప్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ నటనపై ప్రశంసలు వచ్చినా.. కథలో లోపాలు, విఎఫ్ఎక్స్ పరంగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. మొత్తంగా.. అన్ని అడ్డంకులు దాటుకుని ఆడియన్స్ ముందుకొచ్చిన ‘వీరమల్లు‘ లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

Tags:    

Similar News