బాలకృష్ణతో మరోసారి క్రిష్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ-విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబోకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని తీర్చిదిద్దింది దర్శకుడు క్రిష్.;

By :  S D R
Update: 2025-07-25 09:24 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ-విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబోకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని తీర్చిదిద్దింది దర్శకుడు క్రిష్. ఆ తర్వాత నందమూరి కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'యన్.టి.ఆర్' బయోపిక్ ను సైతం క్రిష్ తెరకెక్కించడం విశేషం. ఇప్పుడు మరోసారి బాలయ్య కోసం డైరెక్టర్ గా రంగంలోకి దిగుతున్నాడట క్రిష్. ఈసారి బాలయ్య, క్రిష్ ఇద్దరూ కలిసి 'ఆదిత్య 999' ప్రాజెక్ట్ చేయబోతున్నారట.

'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999' చేయాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథను కూడా సిద్ధం చేశాడు. తన దర్శకత్వంలో ఈ సినిమాని తీర్చిదిద్దాలనేది బాలయ్య కోరిక. కానీ.. ఇప్పుడు 'ఆదిత్య 999' దర్శకత్వ బాధ్యతలను క్రిష్ కి అప్పగించబోతున్నాడట. బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసింది. ఈ సినిమాతోనే బాలయ్య వారసుడు మోక్షఙ్ఞ కూడా డెబ్యూ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం 'అఖండ 2'తో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ కు రెడీ అవుతుంది. అలాగే ఇప్పటికే మలినేని గోపీచంద్ తో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోవైపు క్రిష్ ‘ఘాటి‘ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఘాటి‘ షూటింగ్ కంప్లీట్ కావడంతో బాలయ్య సినిమాపైనే ఫోకస్ పెడుతున్నాడట. త్వరలోనే బాలకృష్ణ-క్రిష్ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Tags:    

Similar News