కూల్ లుక్ లో మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.;

By :  S D R
Update: 2025-09-10 01:32 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిరంజీవి–నయనతారపై ఒక అందమైన నైట్ ఎఫెక్ట్ మెలోడి సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు విజయ్ పొలాకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు.

ఈ షెడ్యూల్‌లో మరో పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. ఇక అక్టోబర్‌లో జరగనున్న భారీ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ పూర్తవ్వనుంది. అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ లో విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొనబోతున్నాడు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో చిరంజీవి–వెంకటేష్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి మాస్–ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ టచ్‌ తో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News