ఆకట్టుకుంటున్న ‘శశివదనే’ ట్రైలర్
"ప్రేమ కోసం పోరాటం" ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోనసీమ, అమలాపురం అందాలు, అక్కడి దృశ్యాలు ఈ సినిమాలో కీలకం. ఈ ప్రాంతంలోనే సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగింది.;
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన "శశివదనే" చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి సైమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించి కథను కూడా అందించాడు. ఎస్.వి.ఎస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఏ.జి. ఫిల్మ్ కంపెనీ అసోసియేషన్‌తో అహి తేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.
"పలాస 1978" చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రక్షిత్ అట్లూరి, ఈ సారి కోమలి ప్రసాద్‌తో కలిసి రొమాంటిక్ లీడ్‌గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ గోదావరి నేపథ్యం.. అక్కడి సంస్కృతి, పచ్చదనంతో కూడిన ప్రేమకథను పరిచయం చేస్తుంది. "ప్రేమ కోసం పోరాటం" ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోనసీమ, అమలాపురం అందాలు, అక్కడి దృశ్యాలు ఈ సినిమాలో కీలకం. ఈ ప్రాంతంలోనే సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగింది.
కోమలి, రక్షిత్ మధ్య మనసుకు హత్తుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇది భావోద్వేగమైన, గ్రామీణ నేపథ్యం గల కథ అని తెలుపుతుంది. పాటలు, ఇంతకుముందు విడుదలైన ప్రోమోలు ఇప్పటికే దృష్టిని ఆకర్షించగా, తాజా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.