సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా మూవీ

‘జబర్దస్త్‘ షోతో బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా మారిన సుడిగాలి సుధీర్, సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.;

By :  S D R
Update: 2025-09-29 08:39 GMT

‘జబర్దస్త్‘ షోతో బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా మారిన సుడిగాలి సుధీర్, సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ‘గాలోడు‘ సినిమాతో హీరోగానూ హిట్ అందుకున్నాడు. ఈరోజు సుధీర్ హీరోగా నటిస్తున్న ఐదో సినిమా ‘హైలెస్సో‘ ముహూర్తాన్ని జరుపుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకు రాబోతున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వి.వి.వినాయక్, బన్నీ వాసు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సినిమాలో నటషా సింగ్, నక్ష శరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శివ చెర్రీ – రవికిరణ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.

Tags:    

Similar News