సినీ కార్మికుల కోసం ప్రత్యేక కమిటీ
టాలీవుడ్ సినీ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వేతనాల పెంపు, పనివేళలు, ఇతర సౌకర్యాల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె, ఆ తరువాత జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.;
By : S D R
Update: 2025-09-29 09:47 GMT
టాలీవుడ్ సినీ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వేతనాల పెంపు, పనివేళలు, ఇతర సౌకర్యాల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె, ఆ తరువాత జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
కార్మికశాఖ కమిషనర్ దాన కిశోర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ దామోదర ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, అలాగే సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి అమ్మిరాజు కనుమిల్లి సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ కమిటీ ప్రధానంగా కార్మికుల వేతనాలు, పని గంటలు, భద్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను పరిశీలించి రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దసరా పండుగ అనంతరం తొలి సమావేశం జరగనుంది.