ఆశికా రంగనాథ్ ‘గత వైభవ‘
ఈమధ్య కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలోనూ పీరియాడిక్ మూవీస్ కి ఆదరణ పెరుగుతుంది. ఇదే కోవలో కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న చిత్రం ‘గత వైభవ‘.;
By : S D R
Update: 2025-09-29 09:21 GMT
ఈమధ్య కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలోనూ పీరియాడిక్ మూవీస్ కి ఆదరణ పెరుగుతుంది. ఇదే కోవలో కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న చిత్రం ‘గత వైభవ‘. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది. ఈ సినిమాతో దుశ్యంత్ హీరోగా పరిచయమవుతుండగా.. హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటిస్తుంది.
నాగార్జున ‘నా సామిరంగ‘తో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకుంది ఆశికా రంగనాథ్. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర‘లోనూ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పీరియడ్ లుక్ లో ఆకట్టుకుంటుంది ఆశికా. సింపుల్ సునీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సర్వగ్రా సిల్వర్ స్క్రీన్స్, సునీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.