నాలుగు రోజుల్లోనే 252 కోట్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. తొలి రోజుకు రూ.154 కోట్లు వసూళ్లు సాధించినట్టు అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ ఆ తర్వాత రెండు, మూడు రోజులకు కలెక్షన్లు ప్రకటించలేదు.;

By :  S D R
Update: 2025-09-29 10:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. తొలి రోజుకు రూ.154 కోట్లు వసూళ్లు సాధించినట్టు అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ ఆ తర్వాత రెండు, మూడు రోజులకు కలెక్షన్లు ప్రకటించలేదు. అయితే.. లేటెస్ట్ గా ‘ఓజీ‘ నాలుగు రోజుల కలెక్షన్లపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లు కొల్లగొట్టింది.

పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ లుక్స్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. మొదటి రోజు నుంచే అపారమైన క్రేజ్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. టికెట్ రేట్లు, స్పెషల్ షోలు, ఓవర్సీస్ రన్ అన్నీ కలిపి సినిమా కలెక్షన్లు కొత్త రికార్డులను సృష్టించేలా దూసుకెళ్తున్నాయి.

సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెక్నికల్ గా ఎంతో ప్లస్ అయ్యింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన ‘ఓజీ‘ లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.



Tags:    

Similar News