ప్రభాస్–చిరంజీవి కాంబో?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో 'స్పిరిట్' ఒకటి. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.;

By :  S D R
Update: 2025-09-29 02:36 GMT

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో 'స్పిరిట్' ఒకటి. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఆ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారట. అంతేకాదు, ప్రభాస్ తండ్రి పాత్రలోనే కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. వంగా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో 'యానిమల్' చూసినవారికి తెలుసు. అందుకే ఈ వార్త మరింత సెన్సేషన్‌గా మారింది.

అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో పెద్దగా నిజం లేదట. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్ గారు, విశ్వంభర, బాబీ, శ్రీకాంత్ ఓదెల వంటి బిజీ ప్రాజెక్ట్‌లలో ఉన్నాడు. మెయిన్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించే అవకాశాలు చాలా తక్కువ.

ఏమైనా, ఈ వార్త నిజమైతే మాత్రం థియేటర్లు బద్దలయ్యేలా హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. కానీ అధికారికంగా ఏ ప్రకటన రాకపోవడంతో ఇది ప్రస్తుతం రూమర్ స్థాయిలోనే ఉందని చెప్పాలి.

Tags:    

Similar News