'ది రాజాసాబ్' ట్రైలర్ వచ్చేస్తోంది!
రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్‌తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది.;
రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్‌తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది. రేపు (సెప్టెంబర్ 29) సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటివరకు మాస్, యాక్షన్, పాన్-వరల్డ్ సినిమాలతో అభిమానులను అలరించిన ప్రభాస్, ఈ చిత్రంతో తొలిసారిగా హారర్ కామెడీ జానర్‌లో అడుగుపెడుతున్నాడు. ఇది ఆయన ఫ్యాన్స్‌కే కాకుండా, మొత్తం సినీప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవం కానుంది.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తుండగా.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. లేటెస్ట్ గా 'ఓజీ'కి అదిరిపోయే ట్రాక్స్ అందించిన తమన్.. 'ది రాజాసాబ్'తో రెబెల్ ఫ్యాన్స్ కు మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. అసలు డిసెంబర్ లో రావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.