ప్రభాస్ ‘స్పిరిట్’ లో క్రేజీ బాలీవుడ్ యాక్టర్ ?

తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-03-24 06:08 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... సంజయ్ దత్ ప్రభాస్ సోదరుడి పాత్రలో నటించే అవకాశం ఉంది.

సంధీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో బాలీవుడ్ నటులను ప్రతినాయక పాత్రల్లో చూపించడంపై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నట్టున్నాడు. యానిమల్ సినిమాలో బాబీ డియోల్‌ విలన్‌గా అదిరిపోయే నటన కనబరిచి సంచలనంగా మారాడు. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాలో కూడా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ ఇంతకు ముందు ‘డబుల్ ఐస్మార్ట్’ మూవీలో విలన్ గా నటించినప్పటికీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ చిత్రంతో ఆయన టాలీవుడ్‌లో భారీ హిట్ అందుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. స్పిరిట్ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే, సంజయ్ దత్ పాత్ర సినిమా కథలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ‘స్పిరిట్’ సినిమాపై హైప్ తారాస్థాయికి చేరుకుంది. మరిన్ని అధికారిక అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News