'మిరాయ్' ఫస్ట్ సింగిల్ అప్డేట్!
‘హను మాన్’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.;
‘హను మాన్’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తేజ సజ్జాకి జోడీగా రితికా నాయక్ నటిస్తుండగా.. విలన్‌గా మంచు మనోజ్ అలరించనున్నాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న 'మిరాయ్' ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది’ పాట రాబోతుంది. జూలై 26న ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. లీడ్ పెయిర్ తేజా-రితికాలపై రొమాంటిక్ గా ఈ పాట ఉండబోతున్నట్టు పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. 'హను మాన్' సినిమాకు సంగీతం అందించిన గౌర హరి ఈ చిత్రానికీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్‌లో యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. 8 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఒక పాన్ వరల్డ్ లెవెల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండబోతోందని టీమ్ చెబుతుంది.