బోరున ఏడుస్తూ బాలకృష్ణ హీరోయిన్ వీడియో !
గ్లామరస్ యాక్ర్టస్ తనుశ్రీ దత్తా, తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తను బోరుమని ఏడుస్తూ.. “దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి” అంటూ వేడుకుంటూ కనిపించింది.;
బాలీవుడ్ సినిమాల్లో నటించి.. నటసింహం బాలకృష్ణ సరసన “వీరభద్ర”మూవీలో నటించిన .. గ్లామరస్ యాక్ర్టస్ తనుశ్రీ దత్తా, తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తను బోరుమని ఏడుస్తూ.. “దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి” అంటూ వేడుకుంటూ కనిపించింది. 2018లో బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడి.. ‘మీటూ’ ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచినప్పటి నుంచి తను నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తనుశ్రీ చెప్పింది.
“నేను ఈ వేధింపులతో విసిగిపోయాను. 2018 ‘మీటూ’ నుంచి ఇది కొనసాగుతోంది. ఈ రోజు విసిగి నేను పోలీసులకు కాల్ చేశాను. దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి. ఆలస్యం కాకముందే ఏదైనా చేయండి” అని ఆమె ఆ వీడియోలో భావోద్వేగంతో చెప్పింది. తన రోజువారీ జీవితాన్ని నడపడం కష్టంగా మారిందని, పనిమనిషిని నియమించలేకపోతున్నానని, ఇంట్లో అంతా అస్తవ్యస్తంగా ఉందని కూడా ఆమె వెల్లడించింది.