‘టెంపర్’.. ‘అరవింద సమేత’.. ఇప్పుడు ‘వార్ 2’
కెరీర్ స్టార్టింగ్‌లో గుండ్రటి లుక్‌తో కనిపించిన ఎన్టీఆర్, సంవత్సరాలుగా ఒక్కో ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఒక్కో సారి మరింత షార్ప్, స్టన్నింగ్ ఫిజిక్‌తో ఫ్యాన్స్‌ని షాక్ చేస్తూ వచ్చాడు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన పాత్రల కోసం శారీరకంగా ఎప్పుడూ లిమిట్స్‌ని బ్రేక్ చేసే హీరో. ఇప్పుడు తన బాలీవుడ్ డెబ్యూతో అదే ఫైర్‌ని హిందీ సినిమా స్క్రీన్‌పై చూపించడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో గుండ్రటి లుక్‌తో కనిపించిన ఎన్టీఆర్, సంవత్సరాలుగా ఒక్కో ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఒక్కో సారి మరింత షార్ప్, స్టన్నింగ్ ఫిజిక్‌తో ఫ్యాన్స్‌ని షాక్ చేస్తూ వచ్చాడు.
‘యమదొంగ’లో సన్నగా, ఫిట్‌గా కనిపించిన లుక్ నుంచి, ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో షర్ట్‌లెస్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఆ తర్వాత ‘అరవింద సమేత’, ‘ఆర్‌ఆర్‌ఆర్’లో పాత్రలకు తగ్గట్టు బాడీని పూర్తిగా రీషేప్ చేసుకుని స్క్రీన్‌పై డామినేట్ చేశాడు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు లుక్ కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌పై ఫోకస్ చేస్తే, ఎన్టీఆర్ కేవలం షో కోసం కాకుండా.. అతని పాత్రల డెప్త్‌ని, స్క్రీన్ ప్రెజెన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఈ మార్పులు దోహదపడ్డాయి.
ఇప్పుడు.. తన తొలి హిందీ సినిమా ‘వార్ 2’తో బాలీవుడ్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో హృతిక్ రోషన్ కబీర్‌గా లీడ్ రోల్‌లో కనిపిస్తుండగా, ఎన్టీఆర్ విక్రమ్ అనే పవర్‌ఫుల్ రైవల్ క్యారెక్టర్‌లో హృతిక్‌తో తలపడనున్నాడు. కథ, పాత్రల వివరాలను నిర్మాతలు సీక్రెట్‌గా ఉంచినప్పటికీ, ఎన్టీఆర్ మరోసారి సిక్స్-ప్యాక్ యాబ్స్‌తో, షర్ట్‌లెస్ లుక్‌లో ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా కోసం అతను చేస్తున్న ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే బజ్ మొదలైంది.
‘వార్ 2’ ఆగస్టు 14, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్ కొన్ని హై-ఎనర్జీ ప్రమోషనల్ షూట్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది, వాటి క్లిప్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రమోషన్స్‌లో కలిసి కనిపించడం లేదు. ఆన్-స్క్రీన్‌లో వాళ్ల రైవల్రీ ఇంటెన్సిటీని ఆఫ్-స్క్రీన్‌లోనూ కొనసాగించడానికి నిర్మాతలు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఈ మూవ్ సినిమాపై హైప్‌ని మరింత పెంచుతోంది.