మెగా 157 కేరళ షెడ్యూల్ పూర్తి !
“మెగా157 టీమ్ కేరళలో అద్భుతమైన సాంగ్, ముఖ్య సన్నివేశాల షూటింగ్‌తో షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది” అని పేర్కొన్నారు.;
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న కొత్త సినిమా మెగా157 కోసం కేరళలోని అందమైన లొకేషన్స్‌లో రొమాంటిక్ సాంగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు, మరోసారి తమ స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకోనున్నారు.
గత నెలలో మస్సూరీలో షెడ్యూల్ ముగిసిన తర్వాత, టీమ్ కేరళకు షిఫ్ట్ అయి ఒక అందమైన ప్రేమ గీతంతో పాటు ముఖ్యమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించింది. మేకర్స్ షేర్ చేసిన అప్‌డేట్‌లో.. “మెగా157 టీమ్ కేరళలో అద్భుతమైన సాంగ్, ముఖ్య సన్నివేశాల షూటింగ్‌తో షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది” అని పేర్కొన్నారు.
ఈ సినిమా ఫన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, ఇందులో క్యాథరిన్ థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చిరంజీవి కూతురు సుష్మిత నేతృత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.