వీరమల్లు వేట మొదలైంది!

పవర్ స్టార్ అభిమానుల కల నిజం కాబోతున్న వేళ ఆసన్నమైంది. 'హరిహర వీరమల్లు' చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ దక్కుతున్నాయి. రిలీజ్‌కు కొద్ది గంటల ముందు నుంచే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.;

By :  S D R
Update: 2025-07-23 15:45 GMT

పవర్ స్టార్ అభిమానుల కల నిజం కాబోతున్న వేళ ఆసన్నమైంది. 'హరిహర వీరమల్లు' చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ దక్కుతున్నాయి. రిలీజ్‌కు కొద్ది గంటల ముందు నుంచే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే 20వేలకు పైగా టికెట్లు అమ్ముడవగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుక్ మై షో, ఇతర యాప్‌లలో హాఫ్ మిలియన్ మార్క్ దాటినట్టుగా సమాచారం.

నైజాం ఏరియాలో కొంతకాలంగా పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల మధ్య ఏర్పడిన సమస్యకు పరిష్కారం లభించడంతో అక్కడి ప్రీమియర్స్ బుకింగ్స్ సైతం మినిట్లలో హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.29.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం.

మొత్తంగా.. భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెడుతున్న 'హరిహర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్ సరికొత్త అవతారాన్ని చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ వీరమల్లు సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి!

Tags:    

Similar News