మరో తెలుగు సినిమాకి సైన్ చేసిన ఉపేంద్ర?
టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాలో ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ చిత్రం రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమై, పాన్-ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.;
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర గురించి పరిచయం అవసరం లేదు. ఈ నటుడు-దర్శకుడు తన వినూత్న సినిమాలైన ‘ఎ, ఉపేంద్ర, యుఐ’ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఆయన త్వరలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’, రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే రెండు భారీ సినిమాల్లో కనిపించనున్నారు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఉపేంద్ర మరో తెలుగు సినిమా సైన్ చేశారని తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ జయశంకర్, గతంలో 2018లో సంతోష్ శోభన్ నటించిన యూత్‌ఫుల్ డ్రామా ‘పేపర్ బాయ్’ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జయశంకర్ చెప్పిన స్క్రిప్ట్‌కు ఉపేంద్ర ఎంతగానో ఆకర్షితుడై, వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాలో ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ చిత్రం రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమై, పాన్-ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవనున్నాయి.