సూర్య బర్త్ డే ట్రీట్!
సూర్య, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈరోజు (జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.;
By : S D R
Update: 2025-07-23 06:17 GMT
సూర్య, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈరోజు (జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు ఉంది’ వంటి డైలాగులతో మాస్ మూడ్‌ని సెట్ చేసిన ఈ టీజర్‌లో రూరల్ యాక్షన్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ మూవీలో సూర్య డ్యూయెల్ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఆర్జే బాలాజీ దర్శకుడు. కోలీవుడ్ యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘కరుప్పు’ అంటే నలుపు అని అర్థం. ఈ తమిళ టైటిల్‌ను తెలుగు వెర్షన్‌కూ పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అర్థం కాని పేర్లు పెట్టడం వల్ల ప్రేక్షకులపై ఇంపాక్ట్ పడకపోవడం, ఆసక్తి తగ్గడం జరుగుతుందని టైటిల్ పై తెలుగు ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.