రుక్మిణి వసంతకు అవకాశాల వెల్లువ !

రుక్మిణి వసంత కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. రుక్మిణి.. యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న “డ్రాగన్” సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి;

By :  K R K
Update: 2025-10-07 08:59 GMT

రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' సినిమా అక్టోబర్ 2న రిలీజై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా ఒక్క కర్ణాటకలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, హిందీ మార్కెట్‌లలోనూ అదరగొట్టింది. ఐదో రోజు కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలోనే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేయడం నిజంగా గొప్ప విషయం.

దీంతో హీరోయిన్ రుక్మిణి వసంతకు ఉన్న క్రేజ్ ఇంకాస్త పెరిగింది. రిషబ్ శెట్టి రేంజ్ పెరుగుతూనే ఉంది. ఆయన ఇప్పటికే "జై హనుమాన్"తో పాటు రెండు భారీ తెలుగు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ఇక రుక్మిణి వసంత కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. రుక్మిణి.. యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న “డ్రాగన్” సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

'కాంతార చాప్టర్ 1' లో రుక్మిణి అందం, పెర్ఫార్మెన్స్‌ చూస్తే, ఆమెకు టాలీవుడ్‌లోని పెద్ద పెద్ద డైరెక్టర్ల నుండి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం. 'కాంతార చాప్టర్ 1' సక్సెస్‌తో రుక్మిణి వసంత ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. "మద్రాసి," "ఏస్," "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, రుక్మిణి కెరీర్ గురించి చాలామందికి డౌట్స్ ఉండేవి. కానీ 'కాంతార చాప్టర్ 1' లో తన అద్భుతమైన నటనతో అందరి అంచనాలను తప్పని నిరూపించింది. ఇప్పుడు రుక్మిణికి అన్నివైపుల నుండి ప్రశంసలు, అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి.

Tags:    

Similar News