‘ఫంకీ’ టీజర్ డేట్ ఫిక్స్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫంకీ’. హిలేరియస్ ఎంటర్టైనర్స్‌లో దిట్ట అయిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.;
By : S D R
Update: 2025-10-07 11:07 GMT
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫంకీ’. హిలేరియస్ ఎంటర్టైనర్స్‌లో దిట్ట అయిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సేన్ ఎనర్జీ, అనుదీప్ హ్యూమర్ టచ్ తో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
లేటెస్ట్ గా మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆద్యంతం నవ్వులు పూయించే ఈ టీజర్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.