'డ్యూడ్' ట్రైలర్ డేట్ ఫిక్స్!
తమిళ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు రెండు చిత్రాలతో రెడీ అవుతున్నాడు. వీటిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'డ్యూడ్' ఒకటి కాగా.. మరొకటి నయనతార నిర్మాణంలో వస్తోన్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.;
తమిళ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు రెండు చిత్రాలతో రెడీ అవుతున్నాడు. వీటిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'డ్యూడ్' ఒకటి కాగా.. మరొకటి నయనతార నిర్మాణంలో వస్తోన్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. అసలు దీపావళి కానుకగా ఈ రెండు చిత్రాలూ రిలీజ్ డేట్స్ కన్ఫమ్ చేసుకున్నాయి. దీంతో ఒకే హీరో నటించిన రెండు సినిమాలూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయనే ప్రచారం జరిగింది.
అయితే.. దీపావళి బరి నుంచి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' తప్పుకుని క్రిస్మస్ సీజన్ కు వెళ్లింది. ఈనేపథ్యంలో ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 17న 'డ్యూడ్' ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్ గా 'డ్యూడ్' ట్రైలర్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రం ట్రైలర్ ను అక్టోబర్ 9న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న ప్రదీప్ 'డ్యూడ్'తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.