'80s స్టార్స్ రీయూనియన్' వీడియో
1980లలో చిత్ర సీమను ఏలిన తారలు ప్రతి ఏడాది ఆత్మీయంగా కలుసుకునే '80s స్టార్స్ రీయూనియన్' ఈసారి మరింత ఉత్సాహంగా, అద్భుతంగా సాగింది.;
By : S D R
Update: 2025-10-07 10:00 GMT
1980లలో చిత్ర సీమను ఏలిన తారలు ప్రతి ఏడాది ఆత్మీయంగా కలుసుకునే '80s స్టార్స్ రీయూనియన్' ఈసారి మరింత ఉత్సాహంగా, అద్భుతంగా సాగింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ వేడుకకు దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలకు చెందిన 31 మంది ప్రముఖ నటీనటులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈసారి రీయూనియన్‌కు ఆతిథ్యమిచ్చిన వారు కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి – శ్రీప్రియ. వారి నివాసంలోనే 'చిరుత థీమ్'తో ఈ వేడుకను నిర్వహించారు. అందరు తారలు చీతా ప్రింట్ డ్రెస్సులతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. నవ్వులు, ఆటలు, పాటలు, డ్యాన్సులతో ఆత్మీయ వాతావరణంలో వేడుక సాగింది.