‘మిత్రమండలి‘ ట్రైలర్ రివ్యూ
టాలీవుడ్‌లో మరో ఫన్ ఫెస్ట్ రాబోతోంది. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బేహరా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిత్ర మండలి’ ట్రైలర్ విడుదలైంది.;
టాలీవుడ్‌లో మరో ఫన్ ఫెస్ట్ రాబోతోంది. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బేహరా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిత్ర మండలి’ ట్రైలర్ విడుదలైంది. యువ దర్శకుడు విజయేంద్ర ఎస్ తెరకెక్కించిన ఈ సినిమా, ఫుల్ ఫన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించే సన్నివేశాలతో నిండిపోయింది. ప్రతి సీన్‌లో కన్ఫ్యూజన్, కానీ అదే సమయంలో కిక్కు ఇచ్చే కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ప్రియదర్శి తన సహజ హ్యూమర్‌తో మళ్లీ ఆకట్టుకోగా, నిహారిక ఎన్.ఎం తన పాత్రలో ఫ్రెష్‌గా కనిపించింది. విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బేహరాల మధ్య ఉన్న కామెడీ కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇంకా వెన్నెల కిషోర్ ఫన్నీ పోలీస్ ఆఫీసర్‌గా, సత్య తన టైమింగ్‌తో, ‘జాతి రత్నాలు‘ దర్శకుడు అనుదీప్ కె.వి. కెమియోతో ట్రైలర్‌కి అదనపు గ్లామర్ జోడించారు.
మొత్తంగా ట్రైలర్ చూస్తే చాలా రోజులకి ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ఉంది. ఈ దీపావళికి కుటుంబంతో సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంది. బి.వి. వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ‘మిత్రమండలి‘ దీపావళి కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తోంది.