‘అరసన్‘గా రాబోతున్న శింబు
తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న క్రేజీ కాంబో శింబు-వెట్రిమారన్ మూవీ. ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు.;
తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న క్రేజీ కాంబో శింబు-వెట్రిమారన్ మూవీ. ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే STR49గా పిలవబడుతున్న ఈ సినిమాకి ‘అరసన్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అరసన్ అంటే తమిళంలో ‘రాజు‘ అని అర్థం. శింబు స్టైల్, వెట్రిమారన్ రియలిస్టిక్ టచ్ తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
‘అరసన్‘ ఫస్ట్ లుక్ పోస్టర్ వెట్రిమారన్ మార్క్ రా & రస్టిక్ టచ్‌తో ఆకట్టుకుంటుంది. ‘వడ చెన్నై’లో ధనుష్ పట్టిన కత్తిని పోలి ఉండే ఈ పోస్టర్ వల్ల, సినిమా అదే యూనివర్స్‌లో భాగమని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. వెట్రిమారన్ మాత్రం కొత్త కథతో వస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కానీ ‘వడ చెన్నై యూనివర్స్‘లోని స్పిరిట్ మాత్రం కనిపిస్తోంది.
ఈ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం బలంగా వినిపిస్తోంది. ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఎవరు ఫైనల్ అవుతారన్నది ఆసక్తి పెంచుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను V Creations బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు.