మూడు చిత్రాలు.. మూడేసి వందల కోట్లు

కేవలం ఒక నెల గ్యాప్ లో వచ్చిన మూడు భాషల చిత్రాలు.. మూడేసి వందల కోట్లు వసూళ్లను సాధించి దక్షిణాది చిత్ర పరిశ్రమకు అదిరిపోయే హిట్స్ అందించాయి.;

By :  S D R
Update: 2025-10-07 11:32 GMT

కేవలం ఒక నెల గ్యాప్ లో వచ్చిన మూడు భాషల చిత్రాలు.. మూడేసి వందల కోట్లు వసూళ్లను సాధించి దక్షిణాది చిత్ర పరిశ్రమకు అదిరిపోయే హిట్స్ అందించాయి. సెప్టెంబర్ నెల మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద మలయాళం చిత్రం ‘లోక‘ వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇప్పటికే రూ.300 కోట్లు వసూళ్లను కొల్లగొట్టి.. మలయాళంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అరుదైన రికార్డును నమోదు చేసింది ‘కొత్త లోక‘.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్ గా రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రూ.300 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఓజీ‘ నిలిచింది. ఈ సినిమాలో పవర్ స్టార్ వింటేజ్ స్వాగ్, స్టైల్స్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ఇంకా.. బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ‘ రన్ కొనసాగుతూనే ఉంది.

మలయాళం నుంచి ‘లోక‘, తెలుగు నుంచి ‘ఓజీ‘ చిత్రాల తరహాలనే ఈనెలలో రిలీజైన ‘కాంతార చాప్టర్ 1‘ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ‘కాంతార‘ సినిమాకి ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1‘ ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందిస్తూ బాక్సాఫీస్ ను కొల్లగొడుతుంది. ఈ సినిమా ఇప్పటివరకూ రూ.350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

Tags:    

Similar News