‘గాడ్ ఆఫ్ వార్’ ప్లాన్స్‌లో మార్పులు!
ఈ సినిమా స్కేల్.. విజువల్ గ్రాండియర్‌ను నిజంగా రిఫ్లెక్ట్ చేసేలా ఒక స్పెక్టాక్యులర్ రివీల్ కోసం వర్క్ చేస్తున్నామని నిర్మాత నాగ వంశీ స్వయంగా చెప్పారు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టనున్నాడు. ఈసారి వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఏదో సాధారణ కథ కాదు.. ఒక పౌరాణిక డ్రామా. "గాడ్ ఆఫ్ వార్" అనే తాత్కాలిక టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. ఇదొక గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందనుందని టాక్.
మొదటగా.. ఈ నెలలో సినిమాను ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌తో అనౌన్స్ చేయాలని నిర్మాతలు భావించారు. కానీ, రణబీర్ కపూర్, యష్ నటించిన "రామాయణ" టీజర్‌ను చూసిన తర్వాత, వాళ్ల ప్లాన్‌ను మార్చేశారు. ఆ టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ చూసి.. "గాడ్ ఆఫ్ వార్" టీమ్ తమ అనౌన్స్‌మెంట్‌ను మరింత గ్రాండ్‌గా, మరింత ఇంప్రెసివ్‌గా చేయాలని డిసైడ్ చేసింది. ఈ సినిమా స్కేల్.. విజువల్ గ్రాండియర్‌ను నిజంగా రిఫ్లెక్ట్ చేసేలా ఒక స్పెక్టాక్యులర్ రివీల్ కోసం వర్క్ చేస్తున్నామని నిర్మాత నాగ వంశీ స్వయంగా చెప్పారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది ఒక కొత్త టెరిటరీ. ఇప్పటివరకూ తన సినిమాల్లో ఎక్కువగా కథ, డైలాగ్స్‌తో మెస్మరైజ్ చేసిన త్రివిక్రమ్.. ఈసారి హెవీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక అంబిషియస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నారు.
ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. ఇదొక విజువల్ స్పెక్టాకిల్ కాబోతోంది. ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పెర్‌ఫార్మర్.. త్రివిక్రమ్ లాంటి విజనరీ డైరెక్టర్ కాంబినేషన్‌లో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే! ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ కొత్త అనౌన్స్‌మెంట్ ఎప్పుడు, ఎలా ఉంటుందో వేచి చూడడమే!