మెగా 157 కోసం ‘పెద్ది’ టెక్నీషియన్
షూటింగ్ ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో జోరుగా మొదలైంది. అందరి దృష్టి యాక్షన్ డైరెక్టర్ నబా కాంత మైతీ మీద ఉంది. రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కోసం చేసిన వైరల్ ఓపెనింగ్ షాట్‌తో ఇప్పటికే హైలైట్ అయిన నబా, ఇప్పుడు మెగా 157 కోసం తన సత్తా చాటనున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశారు. ఆయన మోస్ట్ అవైటింగ్ మూవీ మెగా 157, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాలో చిరంజీవి మూడోసారి కోలీవుడ్ స్టార్ నయనతారతో జతకడుతున్నారు, ఇది ఈ భారీ ప్రాజెక్ట్‌కి మరింత హైప్ తెస్తోంది.
షూటింగ్ ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో జోరుగా మొదలైంది. అందరి దృష్టి యాక్షన్ డైరెక్టర్ నబా కాంత మైతీ మీద ఉంది. రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కోసం చేసిన వైరల్ ఓపెనింగ్ షాట్‌తో ఇప్పటికే హైలైట్ అయిన నబా, ఇప్పుడు మెగా 157 కోసం తన సత్తా చాటనున్నారు. ‘పుష్ప 2’ లో క్లైమాక్స్, జాతర సీక్వెన్స్‌లతో పాటు, చిరు నటించిన ‘ఆచార్య, వాల్తేర్ వీరయ్య’ చిత్రాల్లో తన డైనమిక్ యాక్షన్ కొరియోగ్రఫీతో అదరగొట్టిన నబా.. ఈసారి కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్ అందించబోతున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సహ నిర్మాణం వహిస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి ఎనర్జిటిక్ సౌండ్‌ట్రాక్ అందిస్తున్నారు. సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని హామీ ఇస్తోంది. 2026 సంక్రాంతికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న మెగా 157, ఫ్యాన్స్‌కి మాస్ ఎంటర్‌టైనర్‌గా మరో బ్లాక్‌బస్టర్ అనుభవం ఇవ్వబోతోంది.