ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ కన్నుమూత
By : Surendra Nalamati
Update: 2025-03-08 08:48 GMT
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ గత ఏడాది నుంచి బోన్ మ్యారో సమస్యతో బాధపడుతూ, ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ ఆ శస్త్రచికిత్స విఫలమవడంతో, చివరిసారిగా తారక్‌ను చూడకుండానే కన్నుమూశాడు.
తన అభిమానుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండే తారక్, కౌశిక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అప్పట్లో వీడియో కాల్ ద్వారా అతన్ని పరామర్శించాడు. ‘నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీకోసం నేను దేవునిని ప్రార్థిస్తాను. నువ్వు పూర్తిగా కోలుకున్నాక, కలిసి ‘దేవర’ సినిమా చూద్దాం‘ అంటూ అతనికి ధైర్యం చెప్పాడు. అంతేకాదు, కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి, ఆమెకు ఓదార్పు ఇచ్చాడు.
కౌశిక్ మృతి విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.