కథ లేదు, లాజిక్స్ వెతకొద్దు – నాగవంశీ

Update: 2025-02-28 15:26 GMT

సినిమా ప్రమోషన్లలో నిర్మాతలు సాధారణంగా తమ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం సూటిగా, నిజాయితీగా మాట్లాడారు. కథ, లాజిక్స్ వెతకొద్దు.. రెండున్నర గంటల నాన్‌స్టాప్ కామెడీ కోసం ఈ సినిమా చూడండి అని ఆయన స్పష్టం చేశారు.

నాగవంశీ వ్యాఖ్యలు సాధారణ ప్రొడ్యూసర్ల మాటలకు భిన్నంగా ఉండడం విశేషం. 'ముగ్గురు బీటెక్ నిరుద్యోగులు ఒక మంచి వ్యక్తిని వెధవను చేయడం కథ. అంతే.. హైదరాబాద్‌లో సరదా అయిపోయిందని, గోవాకు వెళ్లి మజా చేస్తున్నాం' అని ఆయన తెలిపారు. 'మా సినిమా చూడటానికి రాగానే నవ్వాల్సిందే. లాజిక్, కథ అనేవి మర్చిపోండి. అవి మిస్సయ్యాయని మమ్మల్ని తిట్టకండి.. మేమే ముందుగా ఒప్పేసుకున్నాం' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ హీరోలుగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న విడుదల కానుంది.

Tags:    

Similar News