తనపై కామెంట్ కు ఘాటుగా స్పందించిన నిధి అగర్వాల్ !

“ఇస్మార్ట్ తరవాత హీరో సినిమా చేసాను, మూడు తమిళ సినిమాలు చేసాను, హరి హర వీర మల్లును సైన్ చేసాను. నేను మంచి కథలకే సైన్ చేస్తాను.;

By :  K R K
Update: 2025-04-14 09:17 GMT

ఈ ఏడాది అందాల హీరోయిన్ నిధి అగర్వాల్‌కి రెండు భారీ చిత్రాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన “హరి హర వీర మల్లు”, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించిన “ది రాజా సాబ్” సినిమాలపై ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రెండూ బడ్జెట్ పరంగా పెద్ద చిత్రాలే కావడంతో, వీటి విజయం నిధి కెరీర్‌కు కీలకమని భావిస్తోంది.

అయితే ఇటీవలి రోజుల్లో ఒక సోషల్ మీడియా యూజర్ నిధి కెరీర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్ చేశాడు. “2019లో ఇస్మార్ట్ శంకర్‌ తర్వాత ఏమి చేసింది? ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. శ్రీలీల తక్కువ టైమ్‌లో టాప్‌ లెవెల్‌కు వెళ్లింది. నిధి ఇంకా ఆ రెండు సినిమాలే పట్టుకుని ఉంది” అంటూ ట్రోల్ చేశాడు.

ఈ వ్యాఖ్యలు నిధి అగర్వాల్‌ను కాస్త కోపం తెప్పించినట్టున్నాయి. శ్రీలీలతో తనను పోల్చడాన్ని ఆమె తక్కువగా తీసుకోలేదు. వెంటనే స్పందిస్తూ ట్విట్టర్‌లో ఆమె ఇలా రిప్లై ఇచ్చింది.. “ఇస్మార్ట్ తరవాత హీరో సినిమా చేసాను, మూడు తమిళ సినిమాలు చేసాను, హరి హర వీర మల్లును సైన్ చేసాను. నేను మంచి కథలకే సైన్ చేస్తాను. కొన్నిసార్లు తప్పుగా ఉండొచ్చు కానీ నా ఉద్దేశం మంచి సినిమాల్లో భాగం కావాలనే. నేను తొందరపడడం లేదు.. నాకు నా ప్రయాణం తెలుసు. నేను ఇక్కడే ఉండబోతున్నాను బ్రదర్.. నా గురించి నీవు టెన్షన్ పడొద్దు” అని ఘాటుగా సమాధానమిచ్చింది.

నిధి అగర్వాల్ చెప్పిన మాటల ద్వారా ఆమె మంచి కథల కోసం ఆగిపోవడం తప్ప, కెరీర్‌కు తూట్లు పెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకోలేదని స్పష్టమవుతోంది. మరి ఈ రెండు భారీ చిత్రాలు ఆమెకు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడతాయో చూడాలి.

Tags:    

Similar News