క్రేజీ తమిళ డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా?

మిత్రన్ గత కొంతకాలంగా తెలుగులో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగ చైతన్యతో చర్చలు సజావుగా సాగుతున్నాయని సమాచారం.;

By :  K R K
Update: 2025-07-11 00:34 GMT

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఒక పోస్ట్ ప్రకారం.. తమిళ డైరెక్టర్లు తెలుగు స్టార్స్‌తో 'గేమ్ ఛేంజర్', 'ది వారియర్', 'కస్టడీ', 'స్పైడర్' వంటి సినిమాలు తీశారు. మరోవైపు, తెలుగు డైరెక్టర్లు తమిళ స్టార్స్‌తో 'లక్కీ బాస్కర్', 'సార్', 'కుబేర', 'ఊపిరి', 'వారిసు' వంటి హిట్ సినిమాలు అందించారు. తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలతో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని ఈ పోస్ట్ హైలైట్ చేసింది.

ఈ నేపథ్యంలో, నాగ చైతన్య తమిళ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌తో కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 'ఇరుంబు తిరై, హీరో, సర్దార్' వంటి షార్ప్ థ్రిల్లర్స్‌కు పేరొందిన మిత్రన్.. తన తదుపరి ప్రాజెక్ట్‌గా సోషల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. మిత్రన్ గత కొంతకాలంగా తెలుగులో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగ చైతన్యతో చర్చలు సజావుగా సాగుతున్నాయని సమాచారం.

అయితే, తమిళ డైరెక్టర్లు తెలుగు స్టార్స్‌తో తీసిన సినిమాలు ఇటీవల విజయం సాధించని నేపథ్యంలో.. చైతన్య అభిమానులు ఈ కాంబినేషన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు. అయితే పియస్ మిత్రన్ కు సక్సెస్ రేట్ బాగా ఉండడంతో .. అతడి ఎఫిషియెన్సీ మీద మరి కొందరు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండుతో ఒక మిస్టికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Tags:    

Similar News