SSMB29 కథలో మిస్టరీ ట్విస్ట్!

Update: 2025-03-11 10:35 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘SSMB29‘. పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం షూటింగ్ ఊహించని వేగంతో సాగుతోంది. రాజమౌళి గ్రాండ్ విజన్‌తో ఈ సినిమాను మలుస్తున్నాడు. అడవులు, నదులు, గుహలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించనున్నాడట దర్శకధీరుడు. భారతదేశంతో పాటు ఆఫ్రికాలోనూ మేజర్ షూటింగ్ జరగనుంది.

ఇప్పటికే హైదరాబాద్ లో కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల ఒడిశాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల జరిగిన కీలక షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ చిన్న వీడియో లీక్ కావడంతో సెట్‌లో భద్రతను మరింత కఠినతరం చేశారట.

ఇక తన సినిమాలకు సంబంధించిన కథను ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి వివరించే జక్కన్న ‘SSMB29‘ విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తున్నాడు. అయినా.. ఈ సినిమా కథ గురించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతుంది.

ఈ సినిమా కథ రామాయణంలోని ఒక అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని, మిథికల్ ఎలిమెంట్స్‌తో అడ్వెంచర్‌గా రూపొందుతుందట. ప్రభాస్ ‘కల్కి‘ మూవీ కథ అంతా కాశీ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు ‘SSMB29‘ కోసం కూడా కాశీని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడట జక్కన్న. కథలో మహేష్ బాబు పాత్రకు కీలకమైన మలుపు కాశిలో మొదలై ఆ తర్వాత అడవుల వరకు విస్తరించనుందట. అందుకోసమే హైదరాబాద్‌లో కాశీ పరిసరాలను ప్రతిబింబించేలా సెట్స్ నిర్మాణం జరుగుతుంది.

Tags:    

Similar News