తెలుగులో మళ్ళీ బిజీ అవుతోంది!

ఇప్పుడు అందరి ఫోకస్ ఆమె నెక్స్ట్ మూవీ ‘డకాయిట్’ మీద ఉంది. ఇందులో ఆమె అడివి శేష్‌తో జోడీ కడుతోంది.;

By :  K R K
Update: 2025-08-06 09:10 GMT

మృణాళ్ ఠాకూర్ కు సౌత్‌లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ.. బాలీవుడ్‌లో ఆమె కెరీర్ గ్రాఫ్ ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో లేదు. ఇప్పుడు, హిందీలో మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుని.. బాలీవుడ్‌లో ఆమె సర్వైవల్ చాన్సెస్ కాస్త డౌన్ అయ్యాయని చెప్పాలి.

.మృణాళ్ 2019లో హృతిక్ రోషన్‌తో ‘సూపర్ 30’ తో బాలీవుడ్‌లో కూల్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ బ్రేక్‌తర్వాత ఒక్క డీసెంట్ హిట్ కూడా కొట్టలేకపోయింది. ‘బట్లా హౌస్, తూఫాన్, సెల్ఫీ, గుమ్రా, ఆంఖ్ మిచోలీ, పిప్పా’...ఈ సినిమాలు కమర్షియల్‌గానో, క్రిటికల్‌గానో ఏమాత్రం ఆడలేదు. లేటెస్ట్‌గా ఈ లిస్ట్‌లో చేరినది ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.

గత ఫ్రైడే రిలీజ్ అయిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్టార్టింగ్ నుంచే స్లో అయింది. ప్రీ-రిలీజ్ బజ్ లేకపోవడం.. 50% టికెట్ డిస్కౌంట్ ఇచ్చినా ఆడియన్స్ ఇంట్రెస్ట్ డల్‌గా ఉండటంతో ఓపెనింగ్ టోటల్ ఫ్లాట్. మృణాళ్ రోల్ కూడా సినిమాకు ఎలాంటి కిక్ ఇవ్వలేకపోయింది, దీంతో ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు.

తెలుగులో కూడా.. ‘ఫ్యామిలీ స్టార్’ అనే ఒక్క బ్యాడ్ చాయిస్ ఆమెను మళ్లీ టైట్ స్పాట్‌లో పెట్టింది. ఇప్పుడు అందరి ఫోకస్ ఆమె నెక్స్ట్ మూవీ ‘డకాయిట్’ మీద ఉంది. ఇందులో ఆమె అడివి శేష్‌తో జోడీ కడుతోంది. శేష్ ఈ సినిమాతో మృణాళ్‌ను మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని టాక్.

ఇండస్ట్రీలో మరో బజ్ ఏంటంటే, అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌తో మృణాళ్ ఓ ప్రాజెక్ట్‌లో చేయబోతుందని. ఈ మూవీ ఆమెను అన్ని లాంగ్వేజ్‌లలో మళ్లీ డిమాండ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News