'వార్ 2' రన్‌టైమ్ ఫిక్స్
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో దూసుకెళుతోంది.;
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో దూసుకెళుతోంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ స్పై యూనివర్స్ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.
లేటెస్ట్ గా 'వార్ 2' సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేయగా, రన్‌టైమ్‌ను 3 గంటలు 2 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎన్టీఆర్-హృతిక్ ల మధ్య జరుగుతున్న సరదా వార్ ప్రమోషన్ ట్రెండ్ అవుతోంది.
ఎన్టీఆర్ 'ఘుంగ్రూ టూట్ జాయేంగే.. పర్ యే వార్ జీత్ నహీ పాయోగే' అంటూ హృతిక్ ఇంటికి బిల్ బోర్డ్ పంపగా, హృతిక్ 'నాటు నాటు హౌ మచ్ ఎవర్ యు వాంట్.. బట్ ఐ యామ్ విన్నింగ్ దిస్ వార్' అని బదులిచ్చాడు. దీనిపై తారక్ స్పందిస్తూ – 'మంచి రిటర్న్ గిఫ్ట్.. కానీ ఇది ముగింపు కాదు. అసలైన యుద్ధం ఆగస్టు 14న మొదలవుతుంది' అంటూ రిప్లై ఇచ్చాడు.
తెలుగులో ఈ సినిమా హక్కులు సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ సొంతం చేసుకోగా, ఆగస్టు 10న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ – బాలీవుడ్ కలయికలో వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టార్గెట్ మాత్రం ఒక్కటే – బాక్సాఫీస్‌ను షేక్ చేయడం!