గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశాను – విజయ్
బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగున్నర గంటలపాటు విచారించింది.;
బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగున్నర గంటలపాటు విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు.
‘నా పేరు బెట్టింగ్ యాప్ కేసులో ప్రస్తావించడంతోనే నన్ను విచారణకు పిలిచారు. కానీ నేను ప్రచారం చేసినది A23 అనే గేమింగ్ యాప్ మాత్రమే. గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లు రెండూ వేరు. గేమింగ్ యాప్‌లు చట్టబద్ధంగా పన్నులు చెల్లిస్తూ, ప్రభుత్వ అనుమతులతో నడుస్తుంటాయి. ఇవి సుప్రీంకోర్టు గుర్తింపు పొందినవి కూడా‘ అని విజయ్ వివరించారు.
తన బ్యాంకు లావాదేవీలన్నీ ఈడీకి సమర్పించినట్లు విజయ్ తెలిపారు. ‘నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేదు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం మాత్రమే ఈ యాప్‌ను ప్రచారం చేశాను. ఆ ఒప్పందానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఈడీకి సమర్పించాను‘ అని వెల్లడించారు.