సెన్సేషనల్ డ్యాన్స్ నంబర్ వచ్చేస్తోంది

ఇండియాలోనే టాప్ డ్యాన్సర్స్ ఎవరంటే ముందుగా వచ్చే పేర్లు హృతిక్ రోషన్, ఎన్టీఆర్. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే పాటకు స్టెప్పులేస్తే.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయినట్టే.;

By :  S D R
Update: 2025-08-06 12:14 GMT

ఇండియాలోనే టాప్ డ్యాన్సర్స్ ఎవరంటే ముందుగా వచ్చే పేర్లు హృతిక్ రోషన్, ఎన్టీఆర్. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే పాటకు స్టెప్పులేస్తే.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయినట్టే. ఇప్పుడు ‘వార్ 2‘లో అలాంటి విజువల్ ట్రీట్ చూడబోతున్నాము. ఇప్పటికే ‘వార్ 2‘ నుంచి హృతిక్, కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి తారక్-హృతిక్ డ్యాన్స నంబర్ రాబోతుంది.

ఈసారి డ్యాన్స్ ఫ్లోర్ పై మా ఇద్దరి వార్ చూడడానికి సిద్ధమా? అన్నట్టుగా ‘సలామ్ అనాలి‘ అనే ఈ పాటకు సంబంధించి ప్రోమో రాబోతున్నట్టు ప్రకటించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. రేపు ఈ సాంగ్ ప్రోమో రానుంది. ఫుల్ సాంగ్ ను థియేటర్లలోనే చూడబోతున్నారు? అంటూ హింట్ కూడా ఇచ్చాడు తారక్. మొత్తంగా.. ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా డ్యాన్సులతో రెచ్చిపోయే ఈ పాట ప్రోమో ఎలా ఉంటుందో చూడాలి.



Tags:    

Similar News