‘ఘాటి‘ ట్రైలర్.. అనుష్క ఉగ్రరూపం

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-08-06 11:50 GMT

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘వేదం‘ సినిమా రావడంతో ‘ఘాటి‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకూ వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

బ్రిటీష్ కాలంలో ఘాట్ రోడ్లను నిర్మించే ఆ ప్రాంత గిరిజనలు.. ఇప్పుడు గంజాయిని ఎందుకు రవాణా చేయాల్సి వచ్చింది. దీంతో వారి పరిస్థితులు ఎలా మారాయి? అనే సరికొత్త కథను ‘ఘాటి‘లో ఆవిష్కరించాడు డైరెక్టర్ క్రిష్. ఈ సినిమాలో గిరిజన ప్రాంత మహిళగా అనుష్క ఆకట్టుకుంటుంది. ఆమెకు పెయిర్ గా తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించాడు.

ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, చైతన్య రావు వంటి వారు కనిపిస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ ఆద్యంతం అనుష్క్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Full View


Tags:    

Similar News