రెండు పార్టులుగా ‘ది రాజా సాబ్‘
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ‘ది రాజా సాబ్‘ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్ లో పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ‘ది రాజా సాబ్‘ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్ లో పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రభాస్‌కు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
లేటెస్ట్ గా ‘రాజా సాబ్‘ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నిర్మాత విశ్వప్రసాద్. ఈ చిత్రం మొత్తం నాలుగు గంటల 30 నిమిషాల ఫుటేజ్‌తో రఫ్ కట్ పూర్తయిందనీ, దీన్ని దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివి వరకు కుదించనున్నట్టు చెప్పారు. అంతేగాక, ‘ది రాజా సాబ్ 2’ కూడా ఉంటుందనీ, కానీ అది మొదటి భాగానికి కొనసాగింపు కాకుండా అదే కొత్త కాన్సెప్ట్‌తో ఓ ఫ్రాంఛైజీగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు.
మరోవైపు ‘ది రాజా సాబ్‘ చిత్రాన్ని ఇప్పటికే డిసెంబర్ 5న తీసుకురానున్నట్టు ప్రకటించారు. కానీ.. లేటెస్ట్ గా ఈ మూవీ సంక్రాంతికి షిప్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.