సినీ కార్మికుల సమ్మె 4వ రోజు అప్డేట్

తెలుగు సినీ కార్మికుల సమ్మె నాలుగో రోజున కొనసాగుతోంది. దీని కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.;

By :  S D R
Update: 2025-08-07 06:18 GMT

తెలుగు సినీ కార్మికుల సమ్మె నాలుగో రోజున కొనసాగుతోంది. దీని కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం ఫెడరేషన్ సభ్యులు మధ్యాహ్నం ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజును, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. ఫెడరేషన్ సభ్యులు చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. సినీ కార్మికుల రెండు ప్రధాన డిమాండ్లు.. వేతనాలు 30% పెంచాలి,

పెంచిన వేతనాలు రోజుకు రోజే చెల్లించాలి.

ఈ రోజు జరిగే చర్చల్లో నిర్మాతలు నిర్దేశించిన నిబంధనలను వివరంగా తెలుసుకుని, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. పీపుల్ మీడియా నిర్మాత టిజి విశ్వప్రసాద్ "సినీ కార్మికులకు స్కిల్స్ లేవు" అని వ్యాఖ్యానించడాన్ని ఫెడరేషన్ ఖండించింది. అలాగే షూటింగ్స్ స్ట్రైక్ పై మైత్రీ నవీన్ మాట్లాడుతూ "ఇండస్ట్రీ పరిస్థితి చాలా టఫ్ గా ఉంది. మార్కెట్స్ బాలేదు.. నాన్ థియేట్రికల్ తగ్గాయి" అన్నారు. ఈ చర్చల ఫలితంగా సమస్య పరిష్కారమై, షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని నిర్మాతలు, కార్మికులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News