పవన్ స్పీడు మామూలుగా లేదు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూ, అభిమానులను ఖుషీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ విడుదల తర్వాత సెప్టెంబర్ 25న ‘ఓజీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూ, అభిమానులను ఖుషీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ విడుదల తర్వాత సెప్టెంబర్ 25న ‘ఓజీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ వేగంగా సాగుతోంది.
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్, విడుదల విషయంలో సందేహాలపై నిర్మాత నవీన్ క్లారిటీ ఇచ్చారు. పవన్‌కు ఇంకా వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. మరో 20–25 రోజులలో మొత్తం షూటింగ్ పూర్తి కానుందట. సినీ కార్మికుల సమ్మె వల్ల 'ఉస్తాద్'పై పెద్దగా ప్రభావం పడలేదని, షూటింగ్ ముంబయి వర్కర్లతో కొనసాగించామన్నారు. అలాగే విడుదల తేదీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండటంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ హై వోల్టేజ్ ఎమోషనల్ సీక్వెన్స్‌గా తెరకెక్కినట్లు ఇటీవల తెలిపింది టీమ్. క్లైమాక్స్ ఎపిసోడ్ ను కొరియోగ్రఫర్ నబకాంత మాస్టర్ డిజైన్ చేశాడు. ఇక 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.