'దేవర 2' కోసం భారీగా సన్నాహాలు!
గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఎన్టీఆర్ 'దేవర' బ్లాక్‌బస్టర్ సాధించింది. పాన్ ఇండియా లెవెల్ లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే చెప్పారు. మొదటి భాగం క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టులతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి.
అయితే ఎన్టీఆర్ 'వార్ 2, డ్రాగన్' ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో 'దేవర 2' ఇప్పట్లో ఉండదు అనే ప్రచారం జరిగింది. డైరెక్టర్ కొరటాల శివ మాత్రం వేరే ప్రాజెక్ట్‌కి కమిట్ అవ్వకుండా తన పూర్తి ఫోకస్ ను 'దేవర 2'పైనే పెట్టాడట. కొరటాల గత కొన్ని నెలలుగా 'దేవర 2' స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తూ, కథను ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ 'వార్ 2' ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' కూడా ఇప్పటికే పట్టాలెక్కింది. త్వరలో ఈ మూవీ షూట్‌లో పాల్గొంటాడు తారక్. దీంతో 'దేవర 2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందట.
మొదటి భాగం విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారి బడ్జెట్‌ను మరింత పెంచబోతున్నారని తెలుస్తోంది. ప్రతినాయక పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్‌తో పాటు బాబీ డియోల్ ని కూడా తీసుకోనున్నారట. హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ కూడా సెకండ్ పార్ట్‌లో ఎంత క్రూసియల్ కానుంది. అలాగే సెకండ్ పార్ట్‌కి అనిరుధ్ మ్యూజికల్ మ్యాజిక్ ఎంతగానో ప్లస్ అవుతుందని భావిస్తుంది టీమ్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 'దేవర 2'ని 2026 దసరా కానుకగా విడుదలకు ముస్తాబు చేయాలని భావిస్తుందట టీమ్.