బన్నీ-త్రివిక్రమ్ మూవీ మరింత ఆలస్యం!

Update: 2025-02-28 15:36 GMT

‘మాడ్ స్క్వేర్’ ప్రెస్ మీట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కబోయే సినిమాపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. మొదట ఏప్రిల్ లేదా మేలో చిత్రాన్ని ప్రారంభించాలని భావించినా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులను మెరుగ్గా ప్లాన్ చేస్తున్న కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమా మొదలవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి 28న విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా, షూటింగ్ మిగిలి ఉండటం, ప్రమోషన్లు మొదలుకాకపోవడం వల్ల ఆ డేట్ కి ఖచ్చితంగా ఉండదనే భావన నెలకొంది. ఒకవేళ పవన్ సినిమా అనుకున్న తేదీకే వస్తే ‘మాడ్ స్క్వేర్’ని వాయిదా వేస్తామని నాగవంశీ తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ‘వీరమల్లు’ సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Tags:    

Similar News