ఆకట్టుకుంటున్న 'సతీ లీలావతి' టీజర్
మెగా కోడలు లావణ్య, మలయాళీ స్టార్ దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి‘. ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎమ్.ఎస్‘ మూవీస్ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.;
మెగా కోడలు లావణ్య, మలయాళీ స్టార్ దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి‘. ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎమ్.ఎస్‘ మూవీస్ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో రాబోతున్న ఈ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది.
టీజర్‌లో లావణ్య, దేవ్ మోహన్ పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తున్నట్లు చూపించగా, ఆ వెంటనే వారి మధ్య సంభవించే గొడవలు, గందరగోళాలను వినోదాత్మకంగా చూపించారు. ఈ సినిమాలో భార్యాభర్తల అనుబంధాన్ని హాస్య భరితంగా దర్శకుడు ఆవిష్కరించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వి.కె. నరేష్, వి.టి.వి. గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.