‘ఓజీ’ చిత్రానికి కూడా పవర్ స్టార్ భారీ ప్రమోషన్స్ !

లేటెస్ట్ టాక్ ప్రకారం.. పవన్ మరోసారి ‘ఓజీ’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగనున్నారట.;

By :  K R K
Update: 2025-07-30 01:55 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ని ముగించారు. అటు ఆలస్యమైన ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. కానీ, ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు ఆయన నెక్స్ట్ బిగ్ మూవీ ‘ఓజీ’ పై పడింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా చుట్టూ హైప్ మామూలుగా లేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పవన్ మరోసారి ‘ఓజీ’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగనున్నారట.

రెండు ఇంటర్వ్యూలతో ఈ సినిమా బజ్‌ని మరింత పెంచాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని టాక్. సాధారణంగా పవన్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉంటారు. కానీ ‘హరిహర వీరమల్లు’ కోసం నిర్మాత ఏ.ఎం. రత్నం రిక్వెస్ట్ మేరకు ఆయన ఆ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ‘ఓజీ’ ప్రమోషన్స్ కోసం కూడా ఇంటర్వ్యూలు ఇస్తారనే వార్తలతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

ఈ ఇంటర్వ్యూల్లో ఏం రివీల్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, షామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో, థమన్ సంగీతంతో రూపొందుతున్న దే కాల్ హిమ్ ‘ఓజీ’ ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Tags:    

Similar News