వరుస సినిమాలతో మెగాస్టార్ దూకుడు !

ఇకపై చిరంజీవి గ్యాప్‌లు లేకుండా వరుసగా సినిమాలు చేయనున్నారు.;

By :  K R K
Update: 2025-07-30 02:17 GMT

మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇకపై పెద్ద గ్యాప్‌లు లేకుండా సినిమాలు చేయనున్నారు. ఆయన తాజాగా సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. గత కొన్ని నెలలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు, ఈ షూటింగ్ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుంది.

కొన్ని ప్యాచ్‌వర్క్‌లు పెండింగ్ ఉంటాయి. వాటిని తర్వాత కంప్లీట్ చేస్తారు. ఇక చిరంజీవి బాబీ కొల్లితో మరో సినిమాకి కమిట్ అయ్యారు. వీరిద్దరూ ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటీవలే చిరంజీవి ఈ ప్రాజెక్ట్‌కి ఫైనల్ ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

బాబీ ఈ సినిమా కోసం తగిన నటీనటులను ఫైనలైజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా 2026 చివరలో రిలీజ్ అవుతుంది. ఇకపై చిరంజీవి గ్యాప్‌లు లేకుండా వరుసగా సినిమాలు చేయనున్నారు.

Tags:    

Similar News