సినీ కార్మికుల సమ్మె తప్పదా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మె తప్పేలా లేదు. వేతన పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో.. సమ్మె అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది.;

By :  S D R
Update: 2025-07-30 06:25 GMT

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మె తప్పేలా లేదు. వేతన పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో.. సమ్మె అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది.

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు చెందిన కార్మిక సంఘాలు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు అమలు చేయాలని ఉన్న ఒప్పందాన్ని ప్రస్తావించాయి. గత ఒప్పందం జూన్ 30తో ముగిసింది. అయితే తాజా చర్చల్లో ఫిల్మ్ ఛాంబర్ వేతనాలను కేవలం 5 శాతం మాత్రమే పెంచుతామని ప్రకటించింది. ఇది తమకు పూర్తిగా అంగీకరించదగిన విషయం కాదని, తాము కోరిన విధంగా 30 శాతం పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్స్ కు హాజరవుతామని ఫెడరేషన్ స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రేపు (జూలై 31) ఉదయం 11:30కి హైదరాబాద్‌లోని కార్మిక భవన్‌లో కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ చర్చల ఫలితంపై పరిశ్రమ మొత్తం దృష్టి ఉంది. సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు లేకపోతే... ఆగస్టు 1వ తేదీ నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News