‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ ఈరోజు గ్రాండ్ గా విడుదలవుతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ ముఖ్య పాత్రలో మెరిశాడు.;
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ ఈరోజు గ్రాండ్ గా విడుదలవుతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ ముఖ్య పాత్రలో మెరిశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు అమెరికాలోని ప్రీమియర్ షోలు జూలై 30 అర్థరాత్రి నుంచే మొదలయ్యాయి.
ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి భారీగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ ఇన్నాళ్ల కెరీర్‌లో నటన పరంగా ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ తన సూరి పాత్రలో అద్భుతంగా నటించాడు అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్లాక్, సత్యదేవ్‌తో సన్నివేశాలు ఎమోషనల్‌గా హిట్ అయ్యాయనేది ట్విట్టర్ టాక్.
సత్యదేవ్, వెంకటేష్ పాత్రలు బలంగా నిలిచాయి, భాగ్యశ్రీ పాత్ర పరిమితంగానే ఉన్నా, పాత్ర పరిధిలో బాగా చేసిందనే రివ్యూస్ వస్తున్నాయి. అనిరుధ్ బీజీఎం సినిమాకే ప్రాణంగా నిలిచిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్లైమాక్స్ కూడా బాగుండడంతో, సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే సినిమా నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల ల్యాగ్ ఉండడం మైనస్ పాయింట్లు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
'కింగ్డమ్' విజయ్ దేవరకొండకి సాలిడ్ కంబ్యాక్ అని ఫ్యాన్స్ హర్షాతిరేకంతో ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంమీద ‘కింగ్డమ్’ పాజిటివ్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే అనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో ఫైనల్ రివ్యూ రానుంది.