అంచనాలు పెంచుతున్న 'మయసభ'
'ప్రస్థానం, రిపబ్లిక్' వంటి చిత్రాల తర్వాత దర్శకుడు దేవా కట్టా నుంచి రాబోతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ'.;
'ప్రస్థానం, రిపబ్లిక్' వంటి చిత్రాల తర్వాత దర్శకుడు దేవా కట్టా నుంచి రాబోతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ'. 'రైజ్ ఆఫ్ ది టైటాన్స్' అనే ట్యాగ్ లైన్ తో వెబ్ సిరీస్ గా కిరణ్ జయ్ కుమార్ తో కలిసి దేవా కట్టా ఈ సిరీస్ ను తీర్చిదిద్దాడు. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇద్దరు ప్రాణస్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు? వారి మధ్య విభేదాలు, ఆ విభేదాలవల్ల సమాజంలో చోటుచేసుకున్న మార్పులు ఎలా ఉన్నాయన్నదే ఈ సిరీస్ ఇతివృత్తం. 'మయసభ' ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజై సెన్సేషనల్ సృష్టిస్తుంది. ఇందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ఇందిరా గాంధీ వంటి నేతల పాత్రలు ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్‌లో సాయికుమార్, దివ్యా దత్తా, నాజర్, శత్రు, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ బాధ్యతలు విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష భాద్యతగా నిర్వహించారు. అక్టోబర్ 7 నుండి సోనీ లివ్ లో ‘మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.