మరికాసేపట్లో నేషనల్ అవార్డ్స్

సినీ టాలెంట్ ను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డుల కోసం సినిమా వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.;

By :  S D R
Update: 2025-08-01 11:19 GMT

సినీ టాలెంట్ ను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డుల కోసం సినిమా వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరోసారి ఆ క్షణం వచ్చేస్తోంది. ఈరోజు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించబోతున్నారు. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు.

జ్యూరీ సభ్యులు తమ తుది నివేదికను సాయంత్రం 4 గంటలకు కేంద్ర సమాచార ప్రసార శాఖకు సమర్పించనున్నారు. అనంతరం, ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశంలో విజేతల వివరాలను వెల్లడించనున్నారు. ఈసారి ఉత్తమ నటుడు విభాగంలో విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్) పేరు బలంగా వినిపిస్తున్నది. అదే విధంగా ఉత్తమ నటి విభాగంలో రాణి ముఖర్జీ (Mrs. Chatterjee Vs Norway) అవార్డు దక్కించుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News