‘భగవంత్ కేసరి‘కి నేషనల్ అవార్డ్

నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి‘ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటింది.;

By :  S D R
Update: 2025-08-01 12:59 GMT

నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి‘ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. 2023లో విడుదలైన ‘భగవంత్ కేసరి‘ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ తర్వాత వరుసగా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించిన చిత్రమిది.

బాలకృష్ణ అంటేనే పక్కా కమర్షియల్ హీరో. అలాంటి బాలకృష్ణతో సందేశాత్మకంగా ‘భగవంత్ కేసరి‘ని తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags:    

Similar News